కరోనా ఇక కాటికి పో.. II మోటివేషనల్ స్పీకర్ బట్టి తిరుపతి కవిత్వం

లోకల్ న్యూస్, మార్చి31 : కరోనా.. ఇప్పుడు ఈ పేరంటే తెలియని వారుండరు. కబంధ హస్తాలతో కాటేస్తున్న కరోనాపై మరో కవిత...

మోటివేషనల్ స్పీకర్ : బట్టి తిరుపతి
కరోనా ఓ కరోనా
కనిపించని ఓ కరోనా
వుహాన్ లో ఊపిరి పోసుకున్నవు
జనాల ఊపిరి తీస్తున్నావు
ఇ లలో కాటేస్తుంటివి
కలలో కూడా కబలిస్తుంటివి
కాలిపోతున్నారు జనం కాటిలోనా

కులం మతం జాతి లేదు
చిన్నా పెద్దా తేడా లేదు
పేద ధని కా భేదం లేదు
ఆడ మగ తేడా లేదు
హోదా కూడా చూడకుండా కాటేస్తుంటివి కరోనా

విదేశాల్లో ఉన్నవారిని 
స్వదేశానికి తీసుకు వచ్చావు
దేశం విలువ తెలియ పరిచావు
కుటుంబం నకు దగ్గర చేసావు కరోనా

మనిషిని మనిషిలా జీవించమంటివి
మానవత్వం చాటమంటివి
మంచి అలవాట్లను నేర్పిస్తివి
కుటుంబ బంధాలను బలపరిస్తివి
మనిషి విలువ తెలిసేలా చేసి మనుషులను దూరం చేయకు కరోనా

లాక్ డౌన్ తో నీకు లాక్ పడిందా
భారతీయుల బలానికి నీవు
బందీవయినావా
పారిపోడమా? లేక చచ్చిపోవడమా?
నీకు వేరే మార్గం లేదు కరోనా

నిన్ను దేశం నుండి పంపడానికి
ప్రభుత్వం నీపై యుద్దం చేస్తుంది.
 యుద్దం లో నీవు ఓడిపోవడం ఖాయం
భారతీయులు గెలవడం నిజం కరోనా

మళ్లీ రావద్దు మా దేశం 
మరచి పో మరచి పో మా దేశం
నిన్ను దేశం నుండి పంపించడానికి సాయం చేసినొల్లందరికీ 
వేల వేల వందనాలు....

                  పంపినవారు
                   బట్టి తిరుపతి
             మోటివేషనల్ స్పీకర్

కథలు, కథనాలు, కవితలు ఇలా ఏదైనా రాయండి.. వాటిని మేము ప్రచురిస్తాం.
- లోకల్ అప్డేట్స్..

Post a Comment

أحدث أقدم