లోకల్ న్యూస్ : కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతు వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జిల్లాకు చెందిన సంతోషిని, అనీషా లకు కరోనా వైరస్ లేదని జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన తన భర్తను కలుసుకోవడానికి తన కూతురు అనిషా తో కలిసి ఈనెల 12వ తేదీన హైదరాబాద్ కు వెళ్లి 17 తారీకు వరకు అతనితో కలిసి ఉన్నా సంతోషిని తిరిగి భూపాలపల్లికి రాగ జ్వరం, జలుబు, తడి దగ్గు తదితర కరోన వ్యాధి లక్షణాల తో బాధ పడడంతో తల్లి, బిడ్డలను ఇద్దరిని ఈ నెల 22న ఎంజీఎం హాస్పిటల్ కు 108 వాహనంలో తరలించి ఐసోలేషన్ వార్డ్ లో ఉంచి చికిత్స చేయడం జరిగిందని, ఈరోజు ఆసుపత్రి వైద్యులు తల్లి బిడ్డల ఇద్దరిని పరీక్షించగా వారిలో కరోనా నెగిటివ్ గా వచ్చిందని తెలిపారని, వారిని రేపు ఎంజీఎం హాస్పిటల్ నుంచి హోం క్వరంటాయిన్ తరలిస్తామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటివరకు ఒకటి కూడా కరోన పాజిటివ్ కేసు నమోదు కానందున జిల్లా ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకూడదని, జిల్లాలో కరోనా వైరస్ వ్యాధి నిరోధించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నదని తెలిపారు.
భూపాలపల్లి జిల్లాలో ఎవరికి కరోనా సోకలేదు ll కలెక్టర్ అబ్దుల్ అజీమ్
byJournalists Dairy
0
تعليقات
إرسال تعليق