లోకల్ న్యూస్, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో రైతులు, వలస కూలీలకు భూపాలపల్లి ఆర్డీవో వై.వి.గణేష్, కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లౌక్‌డౌన్ అమలుచేస్తున్న సందర్భంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని, ఇందుకు వలస కూలీలు సహకరించాలని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు, కూలీ, ఇతర పనుల నిమిత్తం మహారాష్ట్ర నుంచి మహదేవపూర్ ప్రాంతానికి వచ్చిన వలస కార్మికులు లాక్డౌన్ ముగిసేంత వరకు జిల్లా దాటి వెళ్లరాదని సూచించారు.మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఉన్న కారణంగా సరిహద్దులు మూసి వేశారని, అందువలన అక్కడికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. స్థానికంగా పనులు ముగిసినాసరే అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. ప్రభుత్వం తరఫున వలసదారులకు ఒక్కరికి 12 కేజీల బియ్యం, రూ.500 నగదు ఇచ్చామని గుర్తుచేశారు. వ్యవసాయ కూలీలను తీసుకవచ్చిన రైతులకు వారికి వసతి, భోజనం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తినా, సహాయం కావాలన్నా ప్రభుత్వం తరఫున చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
إرسال تعليق