లోకల్ న్యూస్, జాతీయం : డేంజరస్ వైరస్ కరోనాకి వ్యాక్సిన్ అభివృద్ధి దిశగా ఆస్ట్రేలియా సైంటిస్టులు మరో ముందడుగు వేశారు. ఇందుకు జరిపే క్లినికల్ ట్రయిల్స్ అనువైన జంతువుగా ఫెర్రెట్(ముంగిసను పోలి ఉండే క్షీరదం)ను గుర్తించారు. దీని శ్వాసకోశ వ్యవస్థ సేమ్ టూ సేమ్ హ్యమన్ ఊపిరితిత్తులను పోలి ఉంటాయని కనుగొన్నారు. ఈ జీవికి కూడా కరోనా వైరస్ సోకుతుందని నిర్దారించారు. కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(సీఎస్‌ఐఆర్‌వో)లో డేంజరస్ వైరస్ లపై పరిశోధనలు చేస్తోన్న ఈ సైంటిస్టుల టీమ్ ను భారత సంతతికి చెందిన వైరాలజీ ఎక్స్ పర్ట్, ప్రొఫెసర్ శేషాద్రి వాసన్ లీడ్ చేస్తున్నారు.
ఫెర్రెట్లపై ప్రయోగాల ద్వారా కరోనా ఇన్‌ఫెక్షన్ విధానాలపై ఈ టీమ్ అధ్యయనం జరుపుతోంది. అమెరికా, బ్రిటన్, చైనాలో మొదటి దశ క్లినికల్ ట్రయిల్స్ లో టీకాల సమర్థతను వీరు టెస్ట్ చేయనున్నారు. ఇందులో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో పాటు ఇనోవియో ఫార్మా సంస్థ తయారు చేసిన రెండు టీకాలూ ఉన్నాయి. త్వరలోనే వీటిని హ్యూమన్స్ పై కూడా టెస్ట్ చేయబోతున్నారు. అంతకంటే ముందు ఈ వ్యాక్సిన్స్ ను యానిమల్స్ పై విజయవంతంగా పరీక్షించి చూడాలి. కాగా ఒకేసారి జంతువులపై ఇన్ని ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి.
‘ఆక్స్‌ఫర్డ్ తయారుచేసిన వ్యాక్సిన్ ను కండరాల్లోకి ఎక్కించాలి. అయితే దీన్ని ముక్కు ద్వారా ఇస్తే ఎక్కువ సేప్టి ఉంటుందా అనే అంశాన్ని వాసన్ బృందం పరిశీలిస్తోంది. వైరస్‌లో వచ్చే మార్పుల వల్ల ఆ జీవి వ్యవహారశైలిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందన్నది తెలుసుకోవడం కోసం కొవిడ్-19పై ప్రచురితమైన 181 జన్యుక్రమాలను బయోఇన్ఫర్మాటిక్స్ నిపుణుల సాయంతో విశ్లేషించింది.
إرسال تعليق