లోకల్ న్యూస్, వాషింగ్టన్: చైనాకు అనుకూలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పనిచేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు నిజం కాదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. కరోనా కల్లోలం ఇంకా తగ్గని కారణంగా డబ్ల్యూహెచ్ఓకు అందే నిధులకు కత్తెరేయ్యాలనే ఆలోచన కూడా సరికాదని అభ్రిప్రాయపడింది. 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా 400 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సమకూర్చింది. చైనా సమకూర్చిన మొత్తం కంటే ఇది రెండు రెట్లకుపైగానే కావడం గమనార్హం. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాతో కలిసి పనిచేయడమనేది కరోనా వైరస్‌పై అవగాహన పెంచేందుకు ఎంతో అవసరమని సంస్థ డైరెక్టర్ జనరల్ బ్రూస్ ఎలివార్డ్ స్పష్టం చేశారు.
إرسال تعليق