వైద్య ఆరోగ్యశాఖలో నియామకాల కోసం ఏర్పాటైన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తొలి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హైదరాబాద్ లోని ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆస్పత్రిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, లెక్చరర్ అండ్ సీనియర్ రెసిడెంట్ (ఒప్పంద ప్రాతిపదికన) పోస్టు లను భర్తీ చేయనుంది. మొత్తం 36 ఖాళీలు ఉన్నాయి
ఖాళీల వివరాలు:
ప్రొఫెసర్ - 4,
అసోసియేట్ ప్రొఫెసర్-3,
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 20,
బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్-2
లెక్చరర్ ఇన్ మాలిక్యులర్ అంకాలజీ - 1,
సీనియర్ రెసిడెంట్ - 6
వయసు :
ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2020 జూలై 1 నాటి కి 55 మించకూడదు. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు 34 ఏళ్లు, లెక్చరర్ 35 ఏళ్లు, సీనియర్ రెసి డెంట్ పోస్టుకు 45 ఏళ్లు మించకూడదు
అర్హతలు:
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూ ల నుంచి సంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్ /ఎండీఎస్/ ఎంసీహెచ్ డీఎం/డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవా రు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు. బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు పీజీ డిగ్రీ ఎండీ(పాథాలజీ ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్స్) లేదా ఎంబీబీఎస్ తో పాటు డిప్లొమా ఇన్ పాథాల జీ/ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ చదివినవారు అర్హులు.లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారు సంబంధిత విభాగాల్లో హీహెచ్ డీ చేసి ఉండాలి. సీనియర్ రెసిడెంట్ పోస్టుకు సంబంధిత విభాగాల్లో ఎండీ/ఎం ఎస్/ఎంసీ హెచ్/డీఎం/డీఎన్బీ డిగ్రీ /డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు విధానం: ఆన్లైన్
చివరి తేదీ: అక్టోబరు 23
దరఖాస్తు ఫీజు: ప్రొఫెసర్ పోస్టుకు రూ.2000, అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.1500, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్/ లెక్చరర్ రూ.1000, సీనియర్ రెసిడెంట్ రూ.500
హార్డు కాపీలను పంపాల్సిన చిరునామా: MHSRB Old CH&FW Building, DM&HS Campus,
Sultan Bazar, Koti, Hyderabad - 500095
Website : https://mhsrb.telangana.gov.in/ MHSRB/home.htm
إرسال تعليق