కార్తీక దీపం అభిమానానికి ఊహించని గిఫ్ట్ II సర్ ప్రైజ్ అయిన అభిమాని

ఓ అభిమాని ట్వీట్.. కార్తీకదీపం ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్‌(వంటలక్క)ను బాగా ఆకట్టుకుంది. ఆ అభిమాని తననేమీ కోరకపోయినా.. తన సీరియల్ విషయమై చేసిన రిక్వెస్ట్‌కు ఆమె ఫిదా అయ్యారు. కార్తీక దీపం సీరియల్ ప్రసారమవుతున్న సమయంలోనే.. ఐపీఎల్ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా సూర్యాపేటకు చెందిన శివ చరణ్.. తమ కుటుంబం సీరియల్‌ను మిస్ అవుతుందని.. లేదంటే తాను ఐపీఎల్‌ను మిస్ అవ్వాల్సి వస్తుందని.. తమ ఇంట్లో మరో టీవీ కూడా లేదని.. కాబట్టి ఐపీఎల్ సమయాన్ని మార్చాలంటూ చేసిన ట్వీట్‌ను గంగూలీ, స్టార్ మా, చెన్నై ఐపీఎల్‌కు ట్యాగ్ చేశాడు.
ఐపీఎల్ సమయాన్ని రాత్రి 8 గంటలకు మార్చాలని ట్విట్టర్ వేదికగా శివచరణ్ కోరాడు. శివ చరణ్‌ చేసిన ట్వీట్‌ని చూసిన ‘స్టార్ మా’ కూడా శివ చరణ్ కోరిక సరైనదేనని అభిప్రాయపడింది. విషయం తెలుసుకున్న ప్రేమీ.. శివచరణ్‌కు ఒక లేఖ రాయడమే కాకుండా ఊహించని గిఫ్ట్‌ని పంపించింది. ‘‘మీ అభిమానానికి మాటలు రావడం లేదు. ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి మీ మనవి నన్ను కదిలించింది. మీరు ట్విట్టర్‌లో చెప్పిన సమస్యకు పరిష్కారంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కానుక పంపుతున్నాను. మీ ఇంట్లో కార్తీక దీపం ఇక వెలుగుతూనే ఉంటుంది. మీ అభిమానం మా పట్ల ఇలాగే ఉండాలని కోరుతున్నాను. మాస్క్ లేకుండా బయటకు వెళ్లకండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి’’ అని లెటర్‌లో పేర్కొంది. దాంతో పాటు 32 అంగుళాల టీవీని కూడా గిఫ్ట్‌గా పంపించింది.

Post a Comment

أحدث أقدم