- రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి
తలసాని శ్రీనివాస్ యాదవ్
● 3.38 లక్షల మంది గోర్రెల
యూనిట్ల పంపిణీ
రాష్ట్రంలో ఉన్న గోల్లకుర్మలకు, యాదవులకు
75% సబ్సీడితో గోర్రెల యూనిట్ పంపిణీ చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ 2017 లో గోర్రెల
పంపిణీ పథకం ప్రారంభించారని, రాష్ట్ర వ్యాప్తంగా 7.31 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక
చేసి 50% మొదటి దశలో పంపిణీ పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం రెండవ విడత గోర్రెల పంపిణీ కింద పెండింగ్
లో ఉన్న 3.38 లక్షల మంది గోర్రెల యూనిట్ల పంపిణీ జరుగుతుందని అన్నారు. గోర్రెల యూనిట్
వ్యయాన్ని ప్రభుత్వం 1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు పెంచిందని, వీటిలో 25% అంటే
43,750-00 రూపాయలు లబ్దిదారుడి వాటా, మిగిలిన 1,31,250-00 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ
విడుదల చేస్తుందని, జిల్లాలో ఉన్న లబ్దిదారులతో అవగాహన సమావేశాలు నిర్వహించి లబ్దిదారుల
నుండి వాటా సేకరించాలని మంత్రి తెలిపారు. గోర్రెల
కోనుగోలు సంబంధించి సమీపంలో ఉన్న మార్కెట్
ల మ్యాపింగ్ చేయడం జరిగిందని, ప్రతి జిల్లా నుంచి సీనియర్ స్థాయి అధికారిని నియమించి
గోర్రెల కోనుగోలు చేయాలని అన్నారు. ప్రతి గోర్రెకు భీమా సౌకర్యం, జియో ట్యాగింగ్ చేయడం
జరుగుతుందని, ప్రతి జిల్లాలో వెంటనే గోర్రెల
రవాణా కోసం టెండర్లు చేపట్టాలని తెలిపారు. ప్రతి జిల్లాలో గోర్రెల కోనుగోలు సంబంధించి
ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, కలెక్టర్ ల ఆధ్వర్యంలో పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి
ఆదేశించారు.
● లబ్ధిదారులకు కళ్ళద్దాలు
త్వరిత గతిన చేరాలి..
అనంతరం కంటి వెలుగు అంశం పై రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి
సమీక్షిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల్లో 97 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి
15.65 లక్షల రీడింగ్ కళ్ళద్దాలను పంపిణీ చేశామని, 12.18 ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను
ఆర్డర్ చేయగా, జిల్లాలకు 7.4 లక్షల పైగా ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు చేరాయని సీఎస్
తెలిపారు. జిల్లాలకు చేరిన ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు త్వరితగతిన లబ్దిదారులకు వారి
ఇంటి వద్ద అందించే విధంగా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ సూచించారు. కంటి వెలుగు శిబిరాల నాణ్యత నిరంతరం పరిశీలించాలని,
జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా పర్యటించాలని అన్నారు.
● ఆరోగ్య మహిళా కార్యక్రమంపైనవగాహన కల్పించాలి
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ
కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 22,333 మహిళలు పరీక్షలు నిర్వహించి 1132 మంది తదుపరి చికిత్స
కోసం రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు . ఆరోగ్య మహిళా కార్యక్రమం పై ప్రజలలో విస్తృత
ప్రచారం కల్పించాలని, రిఫరల్ ఆసుపత్రిలో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని, మహిళలకు
పూర్తి చికిత్స ప్రాధాన్యతతో ఉచితంగా అందిస్తామని అన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా
8 విభాగాల్లో 57 రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ఆరోగ్యం మెరుగు
పడే అవకాశం ఉందని, జిల్లాలో మెప్మా, మహిళా సంఘాలు, ఏఎన్ఎం,ఆశా లో ద్వారా విస్తృత ప్రచారం
కల్పించాలని, భవిష్యత్తులో మరిన్ని పి.హెచ్.సి లలో ఆరోగ్య మహిళా కేంద్రాల ఏర్పాటు చేస్తామని అన్నారు.
● పట్టాల పంపిణీ వారం రోజులో పూర్తి చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి పట్టాల
పంపిణీ కోసం సేకరించి ఖాళీగా ఉన్న భూముల వివరాలను నూతనంగా రూపోందించిన పోర్టల్ లో నమోదు
చేయాలని, ఈ పోర్టల్ లో నూతన ఎంట్రీ లు, ఎడిట్,
కన్ఫర్మేషన్ విభాగాలు ఉన్నాయని, ఎంఆర్ఓ లు
నమోదు చేసిన వివరాలు ఆర్డిఓ ధృవీకరించాలని, ఈ ప్రక్రియ 3 రోజులో పూర్తి చేయాలని తెలిపారు.భూముల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య 58, 59, 76, 118 లకు సంబంధించి పురోగతి పై సీఎస్
ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు 58 సంబంధించి పెండింగ్ పట్టాల పంపిణీ
వారం రోజులో పూర్తి చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కు సంబంధించి క్రమబద్దికరణ
రుసుము వసూలు పై శ్రద్ద వహించాలని త్వరితగతిన రుసుం వసూలు పూర్తి చేసి పట్టాలు పంపిణీ
చేయాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య 58,59 కింద
దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించాయని, కటాఫ్ తేదీ 2020 జూన్ 02 వరకు పోడగించి
ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఉందని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య
58, 59 లో తిరస్కరణ కు గురైన దరఖాస్తులు మరో సారి రివ్యూ చేసుకోని నూతన నిబంధనల ప్రకారం
అర్హత సాధించే వారికి సమాచారం అందించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో
నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల కేటాయింపు మంచి పురోగతి ఉందని సీఎస్ అభినందించారు. ఏప్రిల్ 15 నాటికి లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ నమోదు పూర్తి చేయాలని
అన్నారు.
ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
దివాకర్ , పశుసంవర్ధక శాఖ అధికారి రంగారావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.శ్రీరామ్,
డి.సి.హెచ్.ఎస్. డా.తిరుపతి , మునిసిపల్ కమిషనర్ అవినాష్, , తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق