ఇరాన్ నుంచి స్వదేశానికి 275 భారతీయల రాక

లోకల్ న్యూస్, అంతర్జాతీయం : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వివిధ దేశాల్లోని భారతీయుల రక్షణార్థం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కోవిడ్‌-19తో ఇరాన్‌ సతమతమౌతోంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇరాన్‌ నుంచి 275 మంది భారత పౌరులను కేంద్రం నేడు తిరిగి తీసుకువచ్చింది. వీరిలో ఎక్కువమంది విద్యార్థులు, యాత్రికులు ఉన్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో జోద్‌పూర్‌కు చేరుకున్నారు. వీరందరిని వైద్య పరీక్షల నిమిత్తం ఆర్మీ వెల్‌నెస్‌ సెంటర్లకు తరలించారు. ఈ నెల ప్రారంభంలో ఇరాన్‌ నుంచే 277 మంది ఇండియన్‌ సిటిజన్స్‌ను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వీరిని కూడా ఆర్మీ వెల్‌నెస్‌ సెంటర్ల ఉంచి పర్యవేక్షిస్తున్నారు. జోధ్‌పూర్‌లో ఆర్మీ రెండో వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు ఢిఫెన్స్‌ పీఆర్‌వో వింగ్‌ కమాండర్‌ పూనిత్‌ చందా తెలిపారు

Post a Comment

أحدث أقدم