తెలంగాణ రైతులకు తీపి కబురు : సీఎం కేసీఆర్

లోకల్ న్యూస్, హైదరాబాద్ : రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. కనీస మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేస్తామని చెప్పారు. రూ.3,200 కోట్లకుపైగా మార్క్‌ఫెడ్‌కు గ్యారంటీ ఇచ్చామని, రైతులకు కూపన్లు ఇచ్చి వాటి ఆధారంగా కొనుగోళ్లు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. కోటి 5 లక్షల టన్నుల వరి వచ్చే ఆస్కారం ఉందని, రైతులకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మార్కెట్‌ యార్డులన్నీ మూసివేశాం, గ్రామాల్లోనే కొనుగోళ్లు చేస్తామన్నారు. రైతులెవరూ ధాన్యాన్ని మార్కెట్‌ యార్డులకు తేవొద్దని, గ్రామాల్లో కరోనా నియంత్రణ ఎక్కువగా ఉందని కేసీఆర్‌ వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచామని, రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్‌ అన్నారు. హార్వెస్టర్లు ఎక్కించే వారికి స్పెషల్‌ పాసులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

- ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు

తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. ఐదారు రోజుల్లో రైతులకు కూపన్లు పంపిణీ చేస్తామని, తెలంగాణలో 40 లక్షల ఎకరాల్లో వరి పండుతోందని కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదని కేసీఆర్‌ తెలిపారు. పౌరసరఫరాల శాఖకు రూ.25 వేల కోట్లు సమకూర్చామన్నారు. గ్రామాల సరిహద్దుల్లోని కంచెలను తొలగించాలని కేసీఆర్‌ అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించాలని, సి విటమిన్‌ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలని కేసీఆర్‌ చెప్పారు. మన దగ్గర పండే పండ్లను ఇతర రాష్ట్రాలకు పంపొద్దని, హైదరాబాద్‌లో 500 కేంద్రాల్లో పండ్ల విక్రయం జరుగుతుందన్నారు. రైస్‌ మిల్లర్లను గ్రామాల్లోకి రానివ్వాలని, రైస్‌ మిల్లర్లు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం రైస్‌ మిల్లర్లతో సమావేశమవుతున్నామని కేసీఆర్‌ వెల్లడించారు.

Post a Comment

أحدث أقدم