లోకల్ న్యూస్, జాతీయం : వలస కూలీలు సరిహద్దులు దాటకుండా అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసేయండని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉండే వలస కూలీలకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివారం నాడు కేంద్రం పేర్కొంది. కొద్ది రోజుల క్రితం ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేశారు. అయితే ఈ నేపథ్యంలో కొందరు వలస కూలీలు తమ సొంతూరికి పోవడానికి రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నారు. తిండి లేక నివాస వసతి సరిగా లేక ఇంటి బాట పడుతున్నారు. ఇలా వెళ్లే వారు వేలల్లో ఉన్నారు.
వాహనాల్లో ఇరుకిరుగా పైకప్పులపై కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సమయంలో ఒకరికి మరొకరికి మధ్య దూరం పాటించాలనే నిబంధనను అతిక్రమిస్తున్నారు. కరోనా వైరస్ ఒకరిని నుంచి మరొకరికి వ్యాపించేది కావున.. దీన్ని అడ్డుకోవాలంటే భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వలస కూలీలు ఇంటిబాట పట్టడానికి మరో కారణం.. ఇంటి అద్దెలు కట్టలేని స్థితిలో వారు ఉండడం. ప్రస్తుతం వారికి ఆదాయమార్గం లేకపోవడంతో ఇంటి యజమానులు అద్దె గదులను ఖాళీ చేయిస్తున్నారు. అయితే వీరిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం అభిప్రాయపడింది
إرسال تعليق