అన్నదానానికి ఆర్థిక చేయూత..

లోకల్ న్యూస్, భూపాలపల్లి(మహాదేవపూర్):  జయశంకర్ భూపాలపల్లి జిల్లా  మహాదేవపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ శ్రీపతిబాపు అన్నదాన సేవ ను అభినందిస్తూ.. అదే గ్రామానికి చెందిన అంగన్ వాడీ టీచర్ పద్మ కుమారుడు చల్ల మనోజ్ రెడ్డి 3వేలు ఆర్థికసాయాన్ని గ్రామ పంచాయితీ సిబ్బందికి అందజేశారు. తన తండ్రి స్వర్గీయ శ్రీ చల్ల బాపురెడ్డి సంస్మరణార్ధం ఆర్థిక సాయం అందించినట్లు మనోజ్ తెలిపారు. కాగా కోవైడ్ కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో అన్నదాన సేవ కొనసాగింపుకు తమ వంతు సాయం అందించానన్నారు..అన్నదానం ప్రాణదానంతో సమానమని నేను నా వంతుగా సమర్పణ చేశానని,ప్రతి ఒక్కరూ ఇలా సాయం చేస్తే పేదలకు ఆకలి అసలే ఉండదని చల్ల మనోజ్ రెడ్డి అన్నారు.

Post a Comment

أحدث أقدم