సింగరేణి కార్మికుల సేవలు అభినందనీయం: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు

లోకల్ న్యూస్, పెద్దపల్లి : దేశమంతా కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ లో ఉన్న సమయంలో సింగరేణి కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అన్నారు. సోమవారం ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ఉదయం షిఫ్ట్ లో కార్మికులకు కరోనా పట్ల అవగాహన కల్పించడంతో పాటు వారికి సంస్థ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... అత్యవసర వేళల్లో కరోనాను ఎదిరించి దేశ ప్రజల అవసరాల దృష్ట్యా విధులకు హాజరై ప్రభుత్వానికి అండగా నిలిస్తున్నారని కొనియాడారు.  కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని అందులో భాగంగా సింగరేణి యాజమాన్యం ప్రతి కార్మికునికి మాస్కు, శానిటైజర్లు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  కార్మికులు విధి నిర్వహణలోనూ సామాజిక దూరం పాటిస్తూ  కరోనా నివారణ చర్యలు అవలంభించాలని కోరారు.
      ఆర్జీ-3 టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, జీఎం కమిటీ సభ్యులు దేవ శ్రీనివాస్, పర్శ బక్కయ్య, పెర్కారి నాగేశ్వర్ రావ్, పిట్ కార్యదర్శి వేముల రవిశంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బేతు కుమార్, సర్పంచ్ పాశం ఓదెలు, మండల టీఆరెస్ అధ్యక్షులు శెంకేశి రవిందర్, గాజుల ప్రసాద్, వేగోలపు మల్లయ్య, బత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم