లోకల్ న్యూస్, భూపాలపల్లి : కరోనా కవితలు రాయిస్తుంది.. అవునండి నిజమే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంకు చెందిన ఓ ఉపాధ్యాయుడు కవితను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ కవితా ఏంటో మీరు కూడా చదవండి..!
కరోనా... ! ఏది ఏమైనా... !!
➖➖➖➖➖➖
రోడ్డుమీద వాహనాలు లేవు!
రణగొణ ధ్వనులు లేవు!
రోడ్డుప్రమాదాలు లేనే లేవు!!
ఆటలు లేవు!
పాటలు లేవు!
చప్పట్లుకొట్టే ఉత్సాహం లేదు!!
వీకెండ్స్ లేవు!
సెకండ్షోలు లేవు!
ఫ్రెండ్స్ కలిసేదే లేదు!!
పబ్బులు లేవు !
పార్టీలు లేవు!
మద్యంతాగిన హంసనడకే లేదు !!
కల్లు లేదు!
కల్లోలం లేదు!
లేట్ గాఇంటికి చేరేలొల్లే లేదు!!
చల్లటిబీర్లు లేవు!
చిల్లర వేషాలు లేవు!
అల్లర్లు లేనే లేవు!!
హత్యలు లేవు!
కేసులు లేవు!
అత్యాచారాలు అసలే లేవు!!
బడులులేవు!
పంతుళ్లులేరు!
పరీక్షలు లేనే లేవు !!
గుడులులేవు !
పూజలు లేవు !
వ్రతాలు అసలే లేవు!!
తీర్పులు లేవు!
శిక్షలు లేవు !
అసలు గొడవలే లేవు !!
సత్కారాలు లేవు!
సన్మానాలు లేవు!
సభలు సభ్యులు అసలే లేరు !!
షూటింగ్స్ లేవు !
రేటింగ్స్ లేవు !
సినిమా రిలీజ్ మీటింగ్స్ లేనే లేవు !!
అయినా బాగుంది !
చాలా చాలా బాగుంది !!
➖➖➖➖➖➖
రాసిన వారు : బి.ప్రభాకర్ రెడ్డి, మహదేవపూర్
కథలు, కథనాలు, కవితలు ఇలా ఏదైనా రాయండి.. వాటిని మేము ప్రచురిస్తాం.
- లోకల్ అప్డేట్స్..
إرسال تعليق