నితిన్, కీర్తి సురేష్ 'రంగ్ దే' మోషన్ పోస్టర్..

సినిమా వార్తలు : యువ  కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో  ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌'  నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే'.   'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన  యువ  డైరెక్టర్‌  'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.  పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

ఈ నెల 30 న చిత్ర కథానాయకుడు నితిన్ పుట్టినరోజును  పురస్కరించుకొని ఇవాళ 'రంగ్ దే' చిత్రం మోషన్ పోస్టర్ ను  చిత్ర యూనిట్‌  విడుదల చేసింది. చిత్ర నాయకా, నాయికలైన అను, అర్జున్ (నితిన్, కీర్తి సురేష్) లను  పరిచయం చేస్తూ ఈ మోషన్ పోస్టర్ ముస్తాబైంది.   నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ 'రంగ్ దే' చిత్రంలో సీనియర్ నటుడు నరేష్,  వినీత్, రోహిణి, కౌసల్య, గాయత్రి రఘురామ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్,  సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్,  మాస్టర్ రోనిత్  తదితరులు నటిస్తున్నారు.  
ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ అందిస్తున్నారు.

Post a Comment

أحدث أقدم