లోకల్ న్యూస్, భూపాలపల్లి : నిరంతరం సేవా.. నిత్యాన్నదానంతో ఆ సర్పంచ్ ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రం దాటి వచ్చిన కూలీలకు అన్నదానం చేస్తూ సాయంగా నిలుస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రానికి చెందిన సర్పంచ్ శ్రీపతి బాపు దాతృత్వ గుణాన్ని చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించగా కూలి పనుల నిమిత్తం మహాదేవపూర్ కు వచ్చిన మహారాష్ట్రీయులు ఇక్కడే చిక్కుకు పొయారు. వీరితో పాటు అనాధలు, గూడు లేని పేదలు బుక్కెడు అన్నం దొరక్క అలమటిస్తున్నారు. దీనిని గమనించిన సర్పంచ్ వారందరికోసం లాక్ డౌన్ పూర్తయ్యే వరకు నిత్యం అన్నదానం చేసేందుకు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పంచాయతీ కార్యాలయమే అడ్డాగా బడుగు జీవులకు అన్నదానం ప్రారంభించారు. కాగా తమ పరిస్థితులను అర్థం చేసుకుని అన్నదానం చేస్తున్న సర్పంచ్ ను సదరు కూలీలు, అనాధలు దేవుడిలా భావిస్తున్నారు. ఇలాంటి వారు ఉండటం మహాదేవపూర్ ప్రజల అదృష్టం అంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రవీందర్,జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్,నాయకులు శీలం గట్టయ్య,డికొండ మల్లేష్,గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
Post a Comment