గుడ్ న్యూస్ : మూడు నెలలు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు..!


లోకల్ న్యూస్, జాతీయం : కరోనా వైరస్ బారిన పడిన దేశాలలో ఇండియా కూడా ఉన్నది.  ఇండియాలో మొత్తం 1071 మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.  కరోనా వలన వలస కూలీలు రోడ్డున పడ్డారు.  రోడ్డున పడిన కూలీలకు కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు.  ఇక ఇప్పటికే చాలామంది ఇంటికే పరిమితం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ ను ఏర్పాటు చేసింది.  అదే విధంగా ప్రతి కుటుంబానికి కొంత డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  దీంతో పాటుగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.  అన్నీ రకాల లోన్ల పై మూడు నెలల మారటోరియం విధించింది.  

అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  కరెంటు బిల్లు చెల్లింపులకు సంబంధించి అన్నీ రాష్ట్రాలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది.  కరెంటు బిల్లుల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించాలని కోరింది.  సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కు కూడా ఆదేశాలు జారీ చేసింది.  లాక్ డౌన్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మూడు నెలల పాటు కరెంట్ బిల్లులపై మారటోరియం విధించాలని కేంద్రం పవర్ జనరేషన్ కంపెనీలను కోరింది.

Post a Comment

Previous Post Next Post