వాయిదా పడిన ఒలింపిక్స్ తేదీలు ఖరారు II 2021, జులై 23న నిర్వహణ

లోకల్ న్యూస్,టోక్యో: కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఒలింపిక్స్‌ను 2021, జూలై 23 నుంచి నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. 2021, ఆగస్ట్ 8తో ఒలింపిక్స్ క్రీడలు ముగియనున్నట్లు ఐఓసీ తెలిపింది. టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాచడంతో ఒలింపిక్స్‌-2020ను నిర్వహించలేని పరిస్థితి. దీంతో వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), నిర్వాహక జపాన్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి.

ఇంత ఎక్కువ కాలం ఒలింపిక్స్ క్రీడలు వాయిదా పడటం ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. పారాలింపిక్స్ ఇప్పటికే వాయిదా పడి ఆగస్ట్ 24, 2021 నుంచి సెప్టెంబర్ 5, 2021 మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. 

Post a Comment

Previous Post Next Post