లోకల్ న్యూస్, న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 2020, ఏప్రిల్ 14ను సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, భారత్‌లోని అన్ని పరిశ్రమలకు సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కేంద్రం కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ గడువు కూడా ఏప్రిల్ 14తోనే ముగియనుంది.
ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి సూచించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఏప్రిల్ 11న మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లాక్‌డౌన్ పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు.
Post a Comment