లోకల్ న్యూస్, పశ్చిమ బెంగాల్ : దేశంలో ఒక వైపు లాక్ డౌన్ కొనసాగింపుపై చర్చలు కొనసాగుతుంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మందుబాబులకు శుభవార్త వినిపించారు. నిత్యావసర వస్తువుల మాదిరిగానే నిర్దిష్ట సమయాల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బెంగాల్ ముఖ్యమంత్రి. దీదీ తీసుకున్న ఈ నిర్ణయంతో బెంగాల్లో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. అయితే రాష్ట్ర ఆదాయం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో ఇకపై ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మద్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. బార్ల నుండి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆర్డర్లు తీసుకోవాలని.. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య మద్యాన్ని డెలివరీ చేయాలని, అది కూడా రాష్ట్ర పోలీసుల ద్వారా మద్యం పంపిణీ జరపాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్ణయించారు. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Post a Comment