లోకల్ న్యూస్, జాతీయం : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఈ పరీక్షలు ఉచితంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరస్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో.. పలు ప్రైవేట్ లాబరేటరీస్‌కు కూడా ఈ కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే కేవలం గుర్తించిన ప్రైవేట్ ల్యాబ్స్‌లోనే జరుగుతున్నాయి. అయితే ఈ ప్రైవేట్ ల్యాబ్స్‌లో జరిగే పరీక్షలన్నీ.. ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దీనికి సబంధించిన ఉత్తర్వులు కూడా జారీచేసింది.
కాగా.. దేశంలో ఇప్పటికే 5వేల పాజిటివ్ కేసులు నమోదవ్వగా..149 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో లాక్‌డౌన్ కూడా పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై ఈ నెల 11వ తేదీన ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
إرسال تعليق