లోకల్ న్యూస్, మధ్యప్రదేశ్ : కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు అత్యవసర సేవల విషయంలో ఎస్మా ప్రయోగిస్తున్నాయి. తాజాగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. కరోనా అరికట్టే చర్యల్లో భాగంగా..అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ESMA) అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. బుధవారం నుంచే ఇది అమల్లోకి వస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం.. కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకే ఈ ఎస్మా చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తుందని ట్వీట్‌లో తెలిపారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని.. ప్రజలకు కావాల్సిన నిత్యవసరాలను డోర్ టూ డోర్ డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కాగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 13 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
नागरिकों के हित को देखते हुए #COVID19outbreak के बेहतर प्रबंधन के लिए आज से सरकार ने मध्यप्रदेश में एसेंशियल सर्विसेज़ मैनेजमेंट एक्ट (Essential Services Management Act) जिसे ESMA या हिंदी में ‘अत्यावश्यक सेवा अनुरक्षण कानून’ कहा जाता है, तत्काल प्रभाव से लागू कर दिया है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 8, 2020
إرسال تعليق