హైదరాబాద్, ఏప్రిల్ 11 : కరోనా వైరస్ నేపథ్యంలో జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రజలకు సమాచారం చేరవేయడంలో నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నారు. పత్రికా వ్యవస్థలో మరీ ముఖ్యంగా స్ట్రింగర్లు, పార్ట్ టైమర్లు జీత, భత్యాలు లేక విలేకరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల జర్నలిస్టులకు కనీసపు నిత్యావసర సరుకులు అందజేయాలని జర్నలిస్ట్ సంఘాల నుండి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ వారిని ఆదుకోవాలని నిర్ణయించింది. జీత, భత్యాలు లేని జర్నలిస్టుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని వారికి జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి మొదటి ప్రయత్నంగా నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు మాస్కులు, శానిటైజర్లను రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మసాబ్ టాంక్‌లోని సమాచార్ భవన్‌లో జరగనుంది. కార్యక్రమంలో ఆందోళ్ శాసనసభ సభ్యుడు క్రాంతి కిరణ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.
Post a Comment