ఇంటింటా కరోనా పై సమరం మొదలైంది..

లోకల్ న్యూస్, మహాదేవపూర్ : మహాదేవపూర్ మండల కేంద్రంలో పంచాయితీ శానిటైజర్ స్ప్రే కు విశేష స్పందన లభిస్తోంది..వాడ వాడల్లో కరోనా పై చైతన్యంతో మహిళలు దగ్గరఉండి మరి ఇంటి పరిసరాలలో శానిటైజర్- సోడియం ఐపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయిస్తున్నారు..ప్రజలలో చైతన్యం రావాలే కానీ సాధ్యం కానిది ఏదైనా ఉంటుందా..ప్రజలు పంచాయితీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని హర్షిస్తున్నారని,ప్రజల కోసం పంచాయితీ చేసే ప్రతి పనిలో మా భాగస్వామ్యం ఉంటుందని మహదేవ్ పూర్ తెరాస పార్టీ  మండల మహిళా అధ్యక్షురాలు అన్నమనేని అరుణ గారు అన్నారు.

Post a Comment

Previous Post Next Post