డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): కరోనా వైరస్‌పై పోరాడేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర సైనిక, పారామిలటరీ బలగాలు, ఎన్‌సీసీ కేడెట్లను రంగంలోకి దించినట్లు ఆ రాష్ట్ర సర్కారు వెల్లడించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ సైనికాధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా సైనికులు, పారామిలటరీ, ఎన్‌సీసీ కేడెట్లను వెంటనే రంగంలోకి దించామని ఉత్తరాఖండ్ రాష్ట్ర అధికారులు వివరించారు.
إرسال تعليق