పసిడి ధరలు పైపైకి.. సామాన్యులకు షాకింగ్ న్యూస్

లోకల్ న్యూస్, బిజినెస్ : పసిడి ప్రియులకు గోల్డ్ ధరలు బిగ్ షాక్ ఇచ్చాయి. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడం వల్లే ఇక్కడ దేశీయంగానూ పసిడి ధర పైపైకి ఎగబాకిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. హైదరాబాద్‌లోని మార్కెట్‌ ధరలను బట్టి ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.50 పెరుగుదలతో రూ.44,030కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.40,030కు చేరింది.

అటు దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ బంగారం ధర భారీగానే పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60 రూపాయలు పెరిగి రూ.41,960కు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.60 పెరుగుదలతో రూ.44,260కు ఎగసింది. ఇక బంగారం ధరతో పాటు వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.90 పెరిగి.. రూ.40,360కు చేరింది

Post a Comment

أحدث أقدم