లండన్: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 205కు పైగా దేశాల్లో కరోనా వైరస్ ప్రవేశించింది. చైనాలోని వుహాన్‌లో పుట్టి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మానవ జాతి మనుగడకే ప్రమాదంగా మారింది. ఐతే కొన్ని దేశాల్లో మాత్రం కోవిడ్-19 అడుగుపెట్టనేలేదు. ప్రపంచంతో ఎక్కువగా సంబంధం లేని చిన్న చిన్న ద్వీపాలు, విదేశీ రాకపోకలు తక్కువగా ఉండే దేశాల్లోని ప్రజలకు వైరస్ సోకలేదు. చైనాకు దగ్గరగా ఉండే ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదైనట్లు ఎలాంటి సమాచారం అధికారికంగా వెల్లడికాకపోవడం గమనార్హం.
ఆ దేశాలు ఇవే..:
ఉత్తర కొరియా, సోల్మన్ ఐలాండ్స్, తజికిస్థాన్, నౌరు, యెమెన్, కిరిబతి, మార్షల్ ఐలాండ్స్ పలావు, మైక్రోనేషియా, సమోవ, తుర్కమెనిస్థాన్, తువాలు, వనాటు, కామరూస్, టోంగా
Post a Comment