చికెన్ వ్యాపారికి కరోనా పాజిటీవ్...విశాఖలో టెన్షన్ టెన్షన్

లోకల్ న్యూస్, విశాఖపట్నం : ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 314 కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా విశాఖలోని గాజువాకలో చికెన్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇతడికి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్ళి వచ్చిన వ్యక్తి నుంచి సోకినట్లు పోలీసులు గుర్తించారు. దానితో విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
గత కొంతకాలం ఇతడు చికెన్ షాపు నిర్వహిస్తుండగా.. తాజాగా కొంతమందికి చికెన్ విక్రయించినట్లు తెలుస్తోంది. దీనితో అతడి దగ్గర ఎవరెవరు చికెన్ తీసుకుని వెళ్ళారన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 14 మందిని గుర్తించారు. అంతేకాకుండా అతడి వద్ద చికెన్ తీసుకెళ్ళిన వారిలో ఎంతమందికి కరోనా పాజిటివ్ వచ్చి ఉంటుందోనన్న ఆందోళన అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిని ట్రేస్ చేసే పనిలో ఉన్న అధికారులు వారితో కాంటాక్ట్ అయినా వారిని కూడా పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందరిని స్వచ్ఛందంగా బయటికి రమ్మని.. టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా.. ఇలా కొంతమంది అధికారుల నుంచి తప్పించుకుంటూనే ఉంటున్నారు. దాంతో వీరి నుండి మరికొందరికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే పోలీసులు మర్కజ్ వెళ్లిన వారిని, వారితో కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్‌లోకి వెళ్ళాలని సూచించినా ఇలా యితడు చికెన్ షాపు నిర్వహించడంతో గాజువాకలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Post a Comment

أحدث أقدم