నిరుపేదలకు నిత్యవసరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

లోకల్‌న్యూస్, పలిమెల
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నివారణ అందరి బాధ్యత అని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. పలిమెల మండలంలో గురువారం నిరుపేదలు అయిన సుమారు 50 కుటుంభాలకు బియ్యం, వంటనూనె, కూరగాయలు పంపిణీ చేసారు. మండలంలో ప్రతి ఒక్కరు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలని ఇందులో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12కిలోల రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని తాహసిల్దార్ ని ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జన్ ధన్ యోజన ద్వారా ప్రతిఒక్కరికి 500 అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలోని కొన్ని గ్రామాలలో కొంతమందికి రేషన్ కార్డు లేని వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని కాంగ్రెస్ పార్టీ చేసిన చిన్న ప్రయత్నమని అన్నారు. ఇంకా ఎవరైనా రేషన్ బియ్యం లేదా నిత్యవసరాల కొరత ఉంటే సర్పంచులు లేదా అధికారుల దృష్టికి తీసుకరావాలని అన్నారు. అనంతరం ఎంపీపి బుచ్చక్క, జెడ్పిటీసి హేమలత మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని, నిత్యం చేతులను శుభ్రంగా కడుగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపి బుచ్చక్క, జెడ్పిటీసి హేమలత, తాహసిల్దార్ మంజుల, స్థానిక సర్పంచి ఆలం సత్యనారాయణ, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, పలిమెల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నన్న, యువజన సంఘం అధ్యక్షుడు రాజేందర్, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి రాంమోహన్ రావు, సీనియర్ నాయకుడు భూపతి దేవేందర్, పంకెన సర్పంచి బొచ్చు శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ భూపతి విజ్ఞాన్ పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم