మహాదేవపూర్ : ప్రతి నీటి చుక్కను వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, సాగునీరు సౌకర్యం, చెరువుల మరమ్మతులు, నూతన చెక్ డ్యామ్ ల నిర్మాణానికి ప్రతి పాదనలు చేసేందుకు పెద్దపల్లి ZP ఛైర్మన్ పుట్ట మధుకర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయా మండలాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా ఈ కార్యక్రమానికి మహాదేవపూర్ ఎంపీపీ బి.రాణిబాయి- రామారావు పాల్గొన్నారు. రైతులకు లబ్ది చేకూరేలా, ప్రతి గ్రామం సాగుకు ఆమోదయోగ్యంగా ఉండేలా తయారుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని అన్నారు.
إرسال تعليق