టిఆర్ఎస్ అంబటిపల్లి ఎస్సీ సెల్ గ్రామ కమిటీ ఎన్నిక II పలువురికి సన్మాన కార్యక్రమాలు

లోకల్ అప్డేట్స్ : పెద్దపల్లి జిల్లా జడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ మరియు భూపాలపల్లి జిల్లా జడ్పి చైర్మన్ శ్రీ జక్కు శ్రీ హర్షిణి - రాకేష్ మరియు మంథని నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు భుపెళ్లి రాజు ఆదేశాల మేరకు మహాదేవపూర్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మెరుగు శేఖర్ ఆధ్వర్యంలో  ఎస్సీ సెల్ అంబట్ పల్లి గ్రామ కమిటీ నియామాకం జరిగింది. ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడుగా తాళ్లపల్లి చంద్రశేఖర్ నియమకమయ్యారు. కాగా తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్ , టి.అర్.ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బట్టి వెంకటస్వామి, కార్యవర్గ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.

- భుపెళ్లి రాజు, లింగంపల్లి శ్రీనివాసరావు, మెరుగు శేఖర్ లను సన్మానించిన అంబట్ పల్లి టీఆర్ఏస్ గ్రామ కమిటీ
పెద్దపల్లి,భూపాలపల్లి జిల్లాల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన భూపెళ్లి రాజు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస రావు, ఎస్సీ సెల్ మహాదేవపూర్ మండల అధ్యక్షుడు మెరుగు శేఖర్లను అంబటిపల్లి టిఆర్ఎస్ గ్రామ కమిటీ శాలువాలతో సన్మానించారు. కాగా వారికి సన్మాన కార్యక్రమం చేపట్టినందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు.
 


Post a Comment

أحدث أقدم