సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • జడ్పిహెచ్ఎస్ విద్యార్థులకు అవగాహన
  • క్రైం జరిగితే 1930కి పిర్యాదు చేయాలని సూచన

మహాదేవపూర్, ఏప్రిల్ 1 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ నేరాలపై మహాదేవపూర్ ఎస్ఐ రాజకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సైబర్ నేరాల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు కూడా సైబర్ నేరాలకు గురికావద్దని ఒకవేళ ఆయనచో వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేసి సైబర్ ఫిర్యాదును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఎస్సై రాజకుమార్, జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు సతీష్, హెడ్ కానిస్టేబుల్ శ్రీను, ఉపేందర్ మరియు కానిస్టేబుల్ కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم