పెద్దపల్లి(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 2 : సేవింగ్స్ రంగంలో సామాన్యులను ప్రోత్సహించే విధంగా పోస్టల్ సేవలు రూపుదిద్దుకుంటున్నాయి. పొదుపులో మహిలను, వృద్ధులను ఆకర్షించాలన్న సంకల్పంతో తాజాగా పోస్టల్ శాఖ మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ నెలలో సేవింగ్స్ స్కీంలో చేరే వారికి పలు వడ్డీ పెంచే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పత్యేకంగా "మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్” “సీనియర్ సిటిజెన్ సేవింగ్స్” 'మంత్లీ ఇన్ కం' స్కీంలలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది పోస్టల్ విభాగం. ఈ స్కీంలో సింగిల్ ఖాతాకు రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతా డిపాజిట్ ను రూ.15 లక్షలకు పెంచినట్టు పెద్దపల్లి పోస్టల్ సూపరింటిండెంట్ పసునూరి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ త్రైమాసికానికి సంబంధించి పలు పోస్టల్ పథకాలపై 0.1 శాతం నుండి 07 శాతం వరకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు వెల్లడించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పై 7 శాతం నుండి 7.7 శాతానికి, సుకన్య సమృద్ధి ఖాతాలపై 7.6 శాతం నుండి 8 శాతానికి, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీంలో రూ. 30 లక్షల వరకు డిపాటిజ్ పరిమితి పెంచుతూ 8 శాతం నుండి 8.2 శాతం వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రభాకర్ తెలిపారు. కిసాన్ వికాస పత్రంపై 78.2 శాతం నుండి 7.5 శాతానికి, రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)పై 5.8 శాతం నుండి 6.2 శాతానికి పెంచినట్టు వివరించారు. ఒక ఏడాది ఫిక్స్ డిపాజిట్ పై 6.6 శాతం నుండి 6.8 శాతానికి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంపై 7.1 శాతం, సేవింగ్స్ ఖాతాలపై అన్ని బ్యాంకుల కంటే అతి ఎక్కువగా అంటే 4 శాతం వడ్డీ రేట్లను పోస్టల్ విభాగం చెల్లిస్తోందని పెద్దపల్లి పోస్టల్ ఎస్పీ ప్రభాకర్ వివరించారు. ఈ నెల 31వరకు ఆయా స్కీంలలో చేరే వారికి మాత్రమే ఈ వడ్డీ రేట్లు అమలవుతాయని ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Use full information
ردحذفإرسال تعليق