జయశంకర్ భూపాలపల్లి(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 6 : ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్'లో మరో ముగ్గురికి అవకాశం లభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పలిమెల మండలం సాక్షి రిపోర్టర్'గా పనిచేస్తున్న సోన్నారి రామయ్యను, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, జిల్లా కార్యవర్గ సభ్యులుగా మహాదేవపూర్ మండలానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ మోతే సాంబయ్య ను, కాలేశ్వరంకు చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రేవెల్లి నాగరాజులను జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. వీరిని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు బండ మోహన్, అంబాల సంపత్'లు సంయుక్తంగా ప్రకటించారు.
ఎస్సీ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అసోసియేషన్'లో మరో ముగ్గురికి చోటు..
byతొలివేకువ
0
Comments
Post a Comment