బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు


◆ రాష్ట్ర అధ్యక్షుడు చీప్ ట్రిక్స్ ప్లే చేయడం సిగ్గు చేటు
◆ రాష్ట్రంలో ప్రశాంతకు భంగం కల్పించేందుకు బీజేపీ కుట్ర
మహాదేవపూర్(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 5 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 353సీ(బస్టాండ్ సమీపంలో) ప్రధాన రహదారిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు బుధవారం దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని ఆదేశాల మేరకు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పదవతరగతి  పేపర్స్ లీకేజీకి ప్రధాన సూత్రదారి బండి సంజయ్ అని ఆరోపించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కేదారి గీతబాయి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలజడి సృష్టించాలని బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని,  స్వయంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇందులో సూత్రధారి కావడం సిగ్గుచేటని అన్నారు. లీకేజీ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్న కటినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, కాటారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పెండ్యాల మమత-మనోహర్, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు లింగాల రామయ్య, మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్, యూత్ మండల అధ్యక్షులు అలీమ్ ఖాన్, జిల్లా గ్రంధాల సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ కుంభం పద్మ, యూత్ మండల అధ్యక్షులు అలీమ్ ఖాన్, యూత్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మేరుగు శేఖర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కూరతోట రాకేష్, మండల సోషల్ మీడియా ఇంఛార్జి దబ్బెట రవీందర్, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మెన్ పోత వెంకటస్వామి, పట్టణ యూత్ అధ్యక్షులు రేవెల్లి రాజశేఖర్, సీనియర్ నాయకులు మేరుగు లక్ష్మణ్ ,  యూత్ ఆర్గనైజర్ చిలుక రమేష్,  చకినారపు చందు, లేతకరి ఆనంద్, చకినారపు రవితేజ, అస్లం ఖాన్, నిట్టూరి సాయికిరణ్, దేవేందర్ చకినారపు శశి, నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم