ఏబీఎన్ రిపోర్టర్ ఓదార్యం : ఆకలి కడుపు నింపిన జర్నలిస్ట్

ఆంధ్రప్రదేశ్, లోకల్ న్యూస్: ప్రజలకు, ప్రభుత్వానికి వారధి మీడియా. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలోనూ, ప్రభుత్వానికి లోటుపాట్లను ఎత్తిచూపడంలోనూ మీడియా పాత్ర కీలకమైంది. అలాంటి బాధ్యత కలిగిన మీడియాగా కష్టకాలంలో సమాజానికి సాయం చేయడంలోనూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయి. సంస్థ మాత్రమే కాదు ఉద్యోగులదీ అదే బాట. తూర్పు గోదావరి జిల్లాలో ఏబీఎన్ రిపోర్టర్ చూపిన ఉదారమే ఇందుకు ఉదాహరణ. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకపోవడంతో యాచకుల పరిస్థితి దయనీయంగా మారింది. మామూలు రోజుల్లో జనం ఇచ్చే చిల్లరతో ఆహారం కొనుక్కుని కడుపు నింపుకునే యాచకులు ఇప్పుడు ఖాళీ కడుపుతో ఆకలికి అలమటిస్తున్నారు. అలా అరుగుల మీద పడుకుని.. తినేందుకు తిండి లేక అలమటిస్తున్న కొందరు బిచ్చగాళ్లను జగ్గంపేట ఏబీఎన్ రిపోర్టర్ మానూరి గంగరాజు గమనించారు.

దూర ప్రాంతాల నుంచి ప్రయాణమై ఎటువంటి సౌకర్యం లేక రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ప్రయాణికులను కూడా ఆయన చూశారు. దీంతో.. యాచకులకు, ప్రయాణం చేస్తూ ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి ఏబీఎన్ రిపోర్టర్ మానూరి గంగరాజు భోజనం అందించారు. కరోనా రక్కసి కల్లోలం సృష్టిస్తున్న ఈ కష్టకాలంలో పిడికెడు మెతుకులు కరువైన వారికి భోజనం పెట్టించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Post a Comment

Previous Post Next Post