హైదరాబాద్, లోకల్ న్యూస్ : తెలంగాణలో కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేవారిని సీఎం కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. కొంతమంది దొంగలు దొరుకుతున్నారని.. చాలా కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదని.. తాను ఇలాంటి వాళ్లకు కరోనా రావాలని శపిస్తున్నానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన ప్రచారం చేసేవాళ్లకు చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయని ఆయన చెప్పారు. తమనెవరూ పట్టుకోలేరని కొందరు మూర్ఖులు అనుకుంటున్నారని, వాళ్లు ఎంత దుష్ప్రచారం చేస్తారో.. అంతకు 100 రెట్లు శిక్ష అనుభవిస్తారని.. ఇకనైనా ఇలాంటి అవాస్తవ ప్రచారాలు మానుకోవాలని సీఎం కేసీఆర్ హితవు పలికారు.
ఇటువంటి విపత్కర సమయంలో ఇలాంటి చిల్లర ప్రచారాలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలా దుష్ప్రచారాలు చేసే వారికి అందరి కంటే ముందు కరోనా సోకుతుందని.. ఇలాంటి దుర్మార్గులకే కరోనా రావాలని కేసీఆర్ శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ ఆరోగ్య శాఖ రాష్ట్రంలో కరోనా వైరస్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు.
Post a Comment