లోకల్ న్యూస్ టీమ్: కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగా గ్రామాల్లో సర్పంచ్ లు, అధికారులు అందుకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు దండం పెడతాం మా ఊళ్లోకి రావద్దంటూ తాత్కాలిక కంచెలు నిర్మిస్తున్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని రాపల్లికోట, పెద్దంపేట, అన్నారం పంచాయతీల్లో, కాటారం మండలంలోని వీరపూర్, జాధారావుపేట పంచాయతీల్లో కంచెలు నిర్మించి బోర్డులు పెట్టారు.
రేగొండ మండలం దమ్మన్నపేట, మహముత్తారం మండలం గండికామారాం పంచాయతీలు సైతం ఇదే బాటలో కంచెలు నిర్మించిన విషయం తెలిసిందే. కాగా పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాల్లో రాపల్లికోట సర్పంచ్ కాటవేన రాజక్క-సమ్మయ్య, ఉపసర్పంచ్ బట్టి శ్రీశైలం, బట్టి దేవేందర్, అప్పాల ఐలయ్య, పెద్దంపేట కార్యదర్శి సృజన్, అన్నారం సర్పంచ్ తో పాటు కార్యదర్శులు, పాలకవర్గాలు పాల్గొన్నారు.
రాపల్లికోటలో కంచె వేసిన దృశ్యం
- పంచాయతీ నిర్ణయాలను అభినందించిన ఎస్సైలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని రాపల్లికోట, అన్నారం పంచాయతీల ఆధ్వర్యంలో కంచెలు ఏర్పాటు చేయగా కాళేశ్వరం ఎస్సై శ్రీనివాస్, మహాదేవపూర్ ఎస్సై బెల్లంకొండ సత్యనారాయణలు సర్పంచ్, సిబ్బందిని అభినందించారు. గ్రామ పరిరక్షణకు సర్పంచ్,పాలక వర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు.
Post a Comment