లోకల్ న్యూస్ : కరుణ వైరస్ కట్టడే లక్ష్యంగా పంచాయతీలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే పలు పంచాయతీలు తమ గ్రామాల్లోకి రావద్డంటూ తాత్కాలిక కంచెలు ఏర్పాటు చేస్తుంటే తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని ఎన్కపల్లి, పలిమెల మండలంలోని ముకునూర్ పంచాయతీలు అదే బాటను ఎంచుకున్నాయి. ఎన్కపల్లి సర్పంచ్ తంబడి కిష్టయ్య ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చే దారులన్నింటిని మూసి గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేశారు. కరోనా వైరస్ ఉధృతి తగ్గేంత వరకు ఎవరిని ఊళ్లోకి రానివ్వమని ప్రతిజ్ఞ చేశారు. దీంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సఫలీకృతం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని పలువురు ఆనందం వ్యక్తం చేసున్నారు. ఏదీ ఏమైనా కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే మహాదేవపూర్, పలిమెల, కాటారం, మహముత్తారం, మల్హర్ మండలాల్లో పలు గ్రామాల స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
إرسال تعليق