లోకల్ న్యూస్, మార్చి26 : కరోనా వైరస్ వ్యాప్తి చెందకండా ఉండేందుకు ఆదివాసీలు వారి పద్ధతుల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అడవులతో మమేకమై ప్రకృతి అందాల నడుమ జీవించే వారంతా కరోనా మహమ్మారి బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు మాస్కులు అందుబాటులో ఉండవు. ప్రత్యామ్నాయంగా వారు చెట్ల ఆకులను సేకరించి తాత్కాలికంగా మాస్కులు తయారు చేసుకుని ధరిస్తున్నారు. ఛత్తీస్ గఢ్‌లోని బస్తర్, దంతెవాడ, కంకేర్ తదితర జిల్లాల్లోని అడవి బిడ్డలు ఆకులనే మాస్క్‌లుగా వినియోగిసత్తున్నారు. పట్టణాల్లో ఉన్న వారు మాస్కులు దొరకడం లేదని చెబుతూ జాగ్రత్తలు పాటించడంలేదు. కానీ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుకేజ్ మాత్రం అప్పటికప్పుడు సెల్ఫ్ మాస్క్‌లు తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. వ్యాధీ తీవ్రత చెప్పిన అర్థం చేసుకొని వారెందరో ఉన్న ఈరోజుల్లో ఆకులనే మాస్కులుగా ఉపయోగిస్తున్న గిరిజనులు ఎందరికో ఆదర్శం.
Post a Comment