లోకల్ న్యూస్, మార్చి27 : మండలంలోని రైతులు తమ పంటలను కోల్డ్ స్టోరేజీకి సహకరించాలంటే అనుమతి తప్పనిసరని మహాదేవపూర్ ఎస్సై బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. రైతులు పండించిన మిరప పంటను కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకునే వారు తమ యొక్క పంటని కోల్డ్ స్టోరేజ్ కి ఉదయం 6గంటల నుండి సాయంత్రము 6గంటల లోపు తీసుకువెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా మీ వాహనం లోడ్ అనంతరం పోలీస్ స్టేషన్ నుండి అనుమతి పత్రం తీసుకొని వెళ్లాలని సూచించారు. పోలీస్ వారు ఇచ్చే అనుమతి పత్రం వలన మీకు పోలీస్ చెక్ పోస్ట్ వద్ద అనుమతి లభిస్తుందని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని అందరు తప్పకుండ ఈ అనుమతి పత్రం తీసుకోవాలని అన్నారు.
Post a Comment