లోకల్ న్యూస్, మార్చి27 : రాష్ట్రంలో 9వ తరగతి వరకున్న విద్యార్థులకు ఈసారి పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది, కోవిడ్ విజృంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది. అయితే కేంద్రం వచ్చే నెల 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఇక పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏప్రిల్ 7 నుంచి ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 వరకు ప్రకటించింది.
- ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ!
మరోవైపు ఈ విద్యా సంవత్సరం ఈ నెల 28తో ముగియనుంది. దీంతో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. కోవిడ్ నేపథ్యంలో లా డౌన్ మరో వారం పొడిగిస్తే కనుక అసలు సాధ్యమే కాదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. 9వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్ చేసేలా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Post a Comment