లోకల్ న్యూస్, భూపాలపల్లి : జడ్పీ ఛైర్ ఫర్సన్ జక్కు శ్రీహర్షిణి-రాకేష్ మరో సారి తన దాతృత్వాన్ని చాటేందుకు ముందుకు వచ్చారు. పలిమెల మండల వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు, కాటారం సబ్ డివిజన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నేడు(సోమవారం) నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 12గంటలకు పలిమెల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరోనా వ్యాధి నివారణలో నిరంతరం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ అహర్నిశలు కష్టపడుతున్న జర్నలిస్టులకు తమవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చామన్నారు. జర్నలిస్టుల ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని కోరారు.
జడ్పీ చైర్ పర్సన్ దాతృత్వం... : జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీకి సిద్ధం..
byAshok Yadav
0
Comments
Post a Comment