గుడ్ న్యూస్.... కేంద్రం నుంచి తాజా ప్రకటన

లోకల్ న్యూస్, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ బారినపడిన 1000మంది రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన 4,10,000 మంది రోగులు వ్యాధి నయమై ఇళ్లకు చేరుకోవడం శుభపరిణామం. అలాగే మన దేశంలో ఒక వైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరో వైపు 1000 మంది రోగులు ఈ వైరస్ బారి నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన తమన్నా జైన్ అనే విద్యార్థిని యూకే నుంచి ఢిల్లీకి విమానంలో మార్చి18వతేదీన తిరిగివచ్చారు. ఆమెకు కరోనా వైరస్ లక్షణాలు లేకున్నా పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో తమన్నా జైన్ ను కాన్పూర్ లోని బీపీఎస్ వైద్యకళాశాల ఆసుపత్రిలో చికిత్స పొంది రెండు వారాల్లో కోలుకున్నారు. ‘‘కరోనా వైరస్ పై పోరాటంలో తాను విజయం సాధిస్తానని నాకు నమ్మకం ఉంది. అలాగే నేను కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాను’’ అని తమన్నాజైన్ చెప్పారు. కరోనా వైరస్ రోగులకు 14 రోజుల నిర్బంధం తర్వాత రెండు సార్లు పరీక్షలు చేసి నెగిటివ్ అని రిపోర్టు వస్తే వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి హోం క్వారంటైన్ కు తరలించారు. చిక్కబళ్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నయమై డిశ్చార్జ్ అయిన రోగులకు వైద్యులు పండ్లు, పూల బొకేలు ఇచ్చి చప్పట్లు కొట్టి అభినందిస్తూ వీడ్కోలు పలికారని కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి కె. సుధాకర్ ఆదివారం ట్వీట్ చేశారు. కరోనా గురించి భయపడకూడదని, అవగాహన ఏర్పరచుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు.
ఫిన్లాండ్, రష్యా, స్పెయిన్ దేశాల్లో పర్యటించి స్వదేశానికి తిరిగివచ్చిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనీ అధికారి శైలేంద్రసింగ్ కరోనా బారినుంచి బయటపడ్డారు. ప్రభుత్వ డూన్ మెడికల్ కాలేజీ లో క్వారంటైన్ లో ఉన్న శైలేంద్రసింగ్ కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాను మొదట్లో భయపడినా, పదిరోజుల క్వారంటైన్ అనంతరం తాను కరోనా బారి నుంచి బయటపడ్డానని శైలేంద్రసింగ్ చెప్పారు

Post a Comment

Previous Post Next Post