లోకల్ న్యూస్, జాతీయం : మన దేశం గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే. “ఇండియా చూడ్డానికి ఎలా ఉన్నా..బ్రతకడానికి బాగుంటుంది”..ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్ ఇది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఈ వాఖ్యం అక్షర సత్యం అనిపిస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి ప్రధాని మోదీ దేశవ్యాప్త లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ పిలుపుకు కొంతమంది అతిగాళ్లు తప్పిస్తే..యావత్ భారతం ఒక్క తాటిపై నిలబడింది. ఎందరో మహానుభావులు దేశం ప్రస్తుత పరిస్థితులు కారణంగా వివిధ రూపాల్లో ధానాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకి ఓ ఇద్దరు యాచుకులు కూడా జమయ్యారు అంటే మీరు నమ్ముతారా?. అవును తిండి దొరకని నిరుపేదల ఆకలి తీర్చేందుకు..ఆ బాధ తెలిసిన ఓ ఇద్దరు యాచకులు కదిలివచ్చారు. తమ వద్ద ఉన్న డబ్బుతో బియ్యం, పప్పులు దానం చేసి మంచి మనసు చాటుకున్నారు.
నేపాల్‌కు చెందిన నేపాలి బాబా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రత్నం అనే ఇద్దరు వ్యక్తులు 25 ఏళ్ల నుంచి హిమాచల్‌ప్రదేశ్ కులులో భిక్షమెత్తుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నారు. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ఫుడ్ లేక ఇబ్బందిపడుతోన్న వారి కోసం తమ వద్ద ఉన్నదానిలో నుంచి కొంత దానం చేయడానికి ముందుకు వచ్చారు. పేదల ఆకలి తీర్చడానికి పనిచేస్తోన్న అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ గురించి తెలుసుకుని.. 50 కిలోల బియ్యం, 50కిలోల గోధుమపిండి, 10కిలోల పప్పులు విరాళంగా అందించారు. ఎంత డబ్బుండి ఏం ఉపయోగం బ్రదర్..ఆకలితో ఉన్నోడికి పట్టెడు అన్నం పెట్టే మంచి మనసు ఉండాలి గానీ.
Post a Comment