లోకల్ న్యూస్, జాతీయం : కరోనా మహమ్మారి, లాక్ డౌన్ అంశాలపై ప్రధాని మోదీ ఆదివారం పలువురు రాజకీయ దిగ్గజాలతో ఫోన్ లో మాట్లాడారు. ఇద్దరు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్.డీ.దేవెగౌడ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ సింగ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో బాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీరిలో ఉన్నారు. ఇంకా తమిళనాట డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ వంటివారితో కూడా ఆయన కొద్దిసేపు మాట్లాడారు. కరోనా నివారణ, మూడు వారాల పాటు లాక్ డౌన్, నేపథ్యంలో ఆయన జరిపిన ఫోన్ సంభాషణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్ డౌన్ పై మోదీ.. విపక్ష నాయకులతో గానీ, ముఖ్యమంత్రులతో గానీ సంప్రదించలేదన్న విమర్శలు వఛ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తివేతకు అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రధాని వీరి సూచనలను కోరినట్టు తెలుస్తోంది. గతవారం ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. వేరేగాక పలువురు క్రికెటర్లు, ఆర్టిస్టులతో కూడా మోడీ ఫోన్ ద్వారా మాట్లాడారు.
గత 24 గంటల్లో దేశంలో 472 కరోనా కేసులు నమోదు కాగా.. 77 మంది మరణించారు. కరోనా కేసులు 3,374 కి చేరాయి. శుక్రవారం ఒక్క రోజే ఆరువందలకు పైగా కేసులు నమోదయ్యాయి.
Post a Comment