లోకల్ న్యూస్, జాతీయం : సోమవారం(ఏప్రిల్ 13) నుంచి రెండు రాష్ట్రాల్లో లిక్కర్ షాపులు దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ చెయ్యాలంటూ అసోం, మేఘాలయ రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. మేఘాలయలో శుక్రవారం వరకు లిక్కర్ సేల్స్ కొనసాగనున్నాయి. అసోంలో మళ్లీ ఆర్డర్స్ వచ్చే వరకు మద్యం షాపులు తెరిచి ఉండడానికి పర్మిషన్స్ ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాలు కూడా కొన్ని కండిషన్స్ పెట్టాయి.
మేఘాలయలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు… అసోంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే షాప్స్ ఓపెన్ చెయ్యాలి
మద్యం కొనేందుకు వచ్చినవారు భౌతిక దూరం పాటించాలి
తుమ్ములు, దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఉన్న ఉద్యోగులకు వైన్ షాపుల్లో విధులు అప్పగించొద్దు
లిక్కర్ బాటిల్ ఇచ్చేప్పుడు, డబ్బులు తీసుకునేటప్పుడు శానిటైజర్ ఉపయోగించాలి
బ్రేవరీలు, డిస్టిలరీలు, బాటిలింగ్ ప్లాంట్లలో డ్యూటీలు చేసేవారిలో 50 శాతం మందితోనే పనిచేయించుకోవాలి. పని చేసే వారికి ఫుడ్ కంపెనీలే పెట్టాలి.
లిక్కర్ సరఫరా చేసే వాహనాలకు పాస్ లు ఉండాలి
వైన్ షాపులు..పోలీసులు, జిల్లా అధికారులు ఇచ్చే మార్గనిర్దేశకాలు తప్పనిసరిగా పాటించాలి
Post a Comment