లోకల్ న్యూస్, హైదరాబాద్ : కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ ఈ వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కిలో చికెన్ రూ.190గా ఉంది. దీనికి కారణం కోళ్ల లభ్యత లేకపోవటమేనని వ్యాపారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ వల్ల రైతుల వద్ద ఉన్న కోళ్లు.. రవాణా, కూలీల సమస్యలతో మార్కెట్‌కు చేరే పరిస్థితిలేదు.
ఈ నేపథ్యంలో చికెన్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. మార్కెట్లో కోళ్ల కృత్రిమ కొరత నెలకొంది. గత ఆదివారం ఏకంగా కిలోకు రూ. 240 వరకు చికెన్ ధర చేరటంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. కొసమెరుపు ఏమిటంటే ఈ వ్యవహారంలో అటు కోళ్ల రైతులు.. ఇటు వినియోగదారులు నష్టపోతున్నారు. చికెన్ విక్రయించే వ్యాపారులు మాత్రం లాభపడుతున్నారు.
Post a Comment