జర్నలిజానికి పూర్వ వైభవం తేవాలి - ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

విజయవంతంగా ముగిసిన జర్నలిస్టులకు 2 రోజుల  నైపుణ్య శిక్షణ తరగతులు
పాత్రికేయులు సమదృష్టితో ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలి
సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమం ముగింపులో పాల్గొన్న ప్రెస్ అకాడమీ చైర్మన్

జయశంకర్ భూపాలపల్లి(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 02 : ప్రస్తుత సమాజంలో కొంతమేర జర్నలిస్టులకు గౌరవం తగ్గిందని, నైతికతతో విధులు నిర్వహిస్తూ జర్నలిజానికి పూర్వ వైభవం తెచ్చేదిశగా పాత్రికేయులు చిత్తశుద్ధితో పనిచేయాలని  రాష్ట్ర అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు . ఆదివారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో జిల్లాలోని పాత్రికేయులకు  ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ   ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల పట్ల గౌరవం కొంతమేర తగ్గిందని, యూట్యూబ్, డిజిటల్ మీడియా వచ్చిన తరువాత చాలా తప్పుడు వార్తలు ప్రాధాన్యం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంతో పోటీపడుతూ వార్తలు సేకరించాల్సి ఉంటుందని, జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా వారి నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతులు నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో శిక్షణ తరగతులు ఇప్పటికే ముగించామన్న ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 1200 మంది జర్నలిస్టులు శిక్షణ అందించామని పేర్కొన్నారు. 
- అనుభవజ్ఞులచే శిక్షణ..
 ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులపాటు నిష్ణాతులైన ప్రతినిధులచే శిక్షణ అందించడం జరిగిందని దీన్ని పాత్రికేయులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వార్త ప్రచారం వేగంగా జరుగుతుందని, ఒక తప్పుడు మాట మాట్లాడినా వెంటనే వ్యాప్తి చెంది అప్పటి వరకు ఉన్న పేరు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. జర్నలిస్టులు నైతికతతో ఉండాలని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పారు. ప్రస్తుత యుగంలో  తప్పుడు వార్తలు అధికంగా ప్రచురితమవుతున్నాయని.. దీని నివారణకు జర్నలిస్టులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. 
- వాత్సవాలను విశ్లేషించాలి.. సరైన పదజాలం వాడాలి..  
సమాజంలో జరుగుతున్న కొత్త కొత్త పరిమాణాలను పూర్తిస్తాయిలో విశ్లేషించి ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా జర్నలిస్టులు పనిచేయాలని అన్నారు.  ఉదాహరణకు ఆదానిపై ఇటీవల వచ్చిన  రిపోర్ట్ సారాంశం పరిశీలించి, వాస్తవ పరిస్థితులు తెలియజేస్తూ వార్తలు రాయడం వల్ల ప్రజల్లో జర్నలిస్టులకు గౌరవం మర్యాద పెరుగుతాయని ఆయన పేర్కోన్నారు. రాజకీయ వార్తలు కవర్ చేసే సమయంలో వార్తాపత్రికలలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు వాడే అసభ్యకర పదజాలం రాకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. 
- విజయవంతంగా ముగిసిన శిక్షణ.. సర్టిఫికెట్ల ప్రధానం
జిల్లాలోని జర్నలిస్టులకు రెండు రోజుల నిర్వహించిన శిక్షణ తరగతులు తెలంగాణ సాంస్కృతి సారధి కళాకారుల ఆటపాటలతో ప్రారంభించి అధ్యాపకుల ట్రైనింగ్ క్లాసులతో విజయవంతంగా ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన శిక్షణలో జర్నలిస్టులకు మధ్యాహ్న భోజనం, టీ స్నాక్స్ అందించారు. కార్యక్రమం అనంతరం జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, బ్యాగులను అందించారు. అనంతరం జిల్లాలోని వివిధ పత్రిక సంఘాల నాయకులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారిని సన్మానించారు. 
- కృతజ్ఞతలు తెలిపిన ప్రెస్ అకాడమీ చైర్మన్
రెండు రోజులపాటు సాగిన జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులకు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల జిల్లాలో శిక్షణ కోసం ఉత్సాహం చూపడం అభినందనీయం అన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రోపెసర్ గంట చక్రపాణి,సుధాకర్ రెడ్డి(టైమ్స్ ఆఫ్ ఇండియా), రమణ కుమార్(మహా న్యూస్ ఇన్ ఫుట్ ఎడిటర్), సీనియర్ దిలీప్ రెడి, టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యదర్శి తడక రాజనారాయణ, సీనియర్ జర్నలిస్టులు, జిల్లా మీడియా ప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు

ఆర్టికల్ ఫోటో గ్యాలరీ

Post a Comment

أحدث أقدم