కుదురుపల్లి వద్ద ముమ్మర వాహన తనిఖీలు

నిషేధిత వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు
కుదురుపల్లి వద్ద తనిఖీల్లో ఎస్ఐ రాజ్ కుమార్
మహాదేవపూర్(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 2 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆదివారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మహాదేవపూర్ ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మహాదేవపూర్ నుండి కాళేశ్వరం, కాళేశ్వరం నుండి మహాదేవపూర్ వైపు వచ్చిన వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న పలు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి వదిలేశారు. నిషేధిత వస్తువులు వాహనాల్లో తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. అలాగే  ప్రతి వాహనదారుడు వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్,ఇన్సూరెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలని సూచించారు ఆయన వెంట సివిల్, సిఆర్పిఎఫ్ సిబ్బంది ఉన్నారు.

Post a Comment

أحدث أقدم